డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతులమీదుగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ లో నాగశౌర్య, షిర్లీ ఒక కార్పొరేట్ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులు గా కనిపిస్తారు. అలా నాగసౌర్య తనని ఇష్టపడడం తో ఆమెను ఆకట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండడం కనిపిస్తోంది. ఇక ఆమె తన వర్జినీటి గురించి మాట్లాడుతూ ఇద్దరి మధ్య ప్రేమ విక్రయించినట్లు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత షిర్లీ కొన్ని కారణాల వల్ల అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
ఇక నాగ శౌర్య, షిర్లీ మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ చాలా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. నాగ శౌర్య ఇందులో మొదటిసారిగా బ్రాహ్మణ అబ్బాయిగా కనిపించనున్నాడు. ఇక ఈసారి కూడా తను కామెడీని నమ్ముకొని ఈ సినిమా ని విడుదల చేయబోతున్నాడు నాగ శౌర్య. నటి రాధిక శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బ్రహ్మాజీ, రాహుల్ రామకృష్ణ, ఇతర తదితరులు కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ చాలా వైరల్ గా మారుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి