ఏప్రియల్ చివరి నుండి ప్రారంభం కావలసిన మహేష్ త్రివిక్రమ్ ల క్రేజీ ప్రాజెక్ట్ కు హీరో సమస్యలు ఏర్పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు అత్యంత వేగంగా జరుగుతున్న ఈ మూవీ కథ ప్రకారం మరొక కీలక నటుడి ఎంపిక జరగవలసి ఉంది. ఈపాత్ర మహేష్ పాత్రతో సరి సమానంగా ఉంటుంది అంటున్నారు.


అయితే ఈపాత్రకు ఇప్పటివరకు తెలుగు టాప్ హీరోల సినిమాలలో నటించిన మోహన్ లాల్ విజయ్ సేతుపతి సముద్రఖని లు కాకుండా మరొక కొత్త మొఖం కోసం అన్వేషణ సాగుతున్నట్లు టాక్. ఆ నటుడు అత్యంత సమర్థవంతమైన నటుడు మాత్రమే కాకుండా రూపు రేఖలు చాల బాగుండాలని త్రివిక్రమ్ భావిస్తూ ఉండటంతో ఆ నటుడి కోసం వేట కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.


ఈ నేపధ్యంలో కొందరు బాలీవుడ్ నటుల పేర్లను కూడ త్రివిక్రమ్ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకసారి త్రివిక్రమ్ ఆ నటుడి పేరు ఫైనల్ చేసిన తరువాత మహేష్ అంగీకారం వచ్చిన తరువాత ఆనటుడి పేరు అధికారికంగా ప్రకటిస్తారు అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈ మూవీని ఏప్రియల్ లో ప్రారంభించి ఎక్కడా గ్యాప్ లేకుండా షూటింగ్ కొనసాగించాలి అని త్రివిక్రమ్ భావిస్తూ ఉంటే ఈవిషయంలో మహేష్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి అని అంటున్నారు.


తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీని మహేష్ ఏప్రియల్ లో మొదలుపెట్టినప్పటికీ మే నెలలో మూడు వారాలపాటు మహేష్ తన కుటుంబ సభ్యులతో యూరప్ వెళ్ళే ఆలోచనలలో ఉండటంతో మే నెలలో ఈమూవీ షూటింగ్ కు తాను అందుబాటులో ఉండనని మహేష్ చెప్పినట్లు టాక్. ఇప్పటికే ఈసినిమా ప్రారంభం కావడం రకరకాల కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. మళ్ళీ ఈసినిమాకు బ్రేక్ అంటే మహేష్ ఆలోచనలకు అడ్డు చెప్పలేక త్రివిక్రమ్ ఈ మూవీకి సంబంధించిన ఇతర నటీనటులు నటించే సీన్ మహేష్ లేకుండానే పూర్తి చేయాలని అనుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: