మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సర్కార్ వారి పాట సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు మహేష్ బాబు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చిత్రీకరణ కోసం ఎదురు చూస్తున్నారు.  పలుమార్లు ఈ సినిమా యొక్క షూటింగ్ ను జరుపుతూ వచ్చాడు మహేష్. ఇప్పటికే ఈ సినిమా మొదలుపెట్టి షూటింగ్ పూర్తి చేయవలసింది. కానీ అది కుదరలేదు.

సర్కారు వారి పాట సినిమా తో పాటే షూటింగ్ జరుపుకోవాల్సిన ఈ సినిమా ఎందుకో మొదలు కాలేదు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు త్వరలో మొదలు కాబోతున్న కూడా ఈ సినిమా మొదలు కాక పోవడం పట్ల అసలు ఈ సినిమా ఉందా అన్న అనుమానం ఒక వైపు ఎక్కువ అవుతుంది. మహేష్ కూడా ఈ సినిమా గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారని చెప్పవచ్చు.

తాజాగా ఎట్టకేలకు మహేష్ సన్నిహితుల నుంచి ఈ సినిమా సమాచారం వచ్చినట్లుగా తెలుస్తుంది. మే నెలలో సర్కారు వారి పాట సినిమా ను విడుదల చేసిన తర్వాత జూన్ నెలలో త్రివిక్రమ్ సినిమా ను మహేష్ బాబు మొదలుపెడతాడు. ఈ నేపథ్యంలో జూన్ నెలలో ఈ సినిమాను మొదలు పెట్టి ఈ ఏడాది చివర్లో పూర్తి చేయనున్నారు. ఆ విధంగా ఆ వెంటనే రాజమౌళి సినిమాను మొదలు పెడుతున్నాడు ప్రిన్స్.  వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఆ విధంగా మూడు సినిమాలకు సంబంధించిన మహేష్ బాబు లైనప్ అధికారికంగా ప్రకటించకపోయినా అభిమానులు మాత్రం ఈ లైనప్ కు రిలాక్స్ అవుతున్నారు. ఈ ఏడాది సర్కారు వారి పాట సినిమా విడుదల చేసి వచ్చే ఏడాది  తొలి భాగంలో త్రివిక్రమ్ సినిమా విడుదల తర్వాత వచ్చే ఏడాది చివర్లో జక్కన్న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఏదేమైనా మహేష్ ప్లాన్ అదిరిపోయింది అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: