సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం సర్కారు వారి పాట ఇటీవల విడుదలై మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇక ఏ సినిమా మంచి విజయం సాధించడంతో మహేష్ బాబు తన తదుపరి చిత్రం రాజమౌళి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను కూడా సిద్ధం చేశారు. తండ్రీ తో  కలిసి రాజమౌళి స్క్రిప్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో బిజీగా ఉన్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళి సినిమాలో మహేష్ బాబు గెటప్ ఎలా ఉండబోతోంది అనే విషయం పై అభిమానులు ఎవరికివారు రకరకాలుగా ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక అంతా చూస్తూ ఉంటే మహేష్ బాబు రాకుమారుడిని తలపించేలా ఉన్నాడు అని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే మొన్నటికి మొన్న విజయేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అడవి బ్యాక్ డ్రాప్ లో మొత్తం షూటింగ్ జరుగుతుంది అని,  అందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నామని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. అంతేకాదు మహేష్ బాబు సినీ కెరియర్ లోనే మరిచిపోలేని ఒక  అద్భుతమైన సినిమాగా ఈ సినిమా నిలబడుతోంది అని కూడా ధీమా వ్యక్తం చేశారు విజయేంద్రప్రసాద్.ఇకపోతే తాజాగా మహేష్ బాబు కసరత్తులు చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో మహేష్ బాబు చాలా తీవ్రంగా శ్రమిస్తున్న ట్లు తెలుస్తోంది


జిమ్ నిపుణుడు అయిన కోచ్ సమక్షంలో మజిల్స్ బిల్డ్ చేసుకోవడానికి మహేష్ బాబు కష్టపడుతున్న తీరు చూసి అందరూ ఆశ్చర్య పరచడమే కాకుండా ఆసక్తి కూడా కలుగుతోంది. ఇకపోతే మహేష్ బాబు అందుకు తగ్గట్టుగానే తన శరీరాకృతిని మార్చుకునే ప్రయత్నం లో ఉన్నారా అన్నట్లుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: