విక్టరీ గా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న f3 సినిమా శుక్రవారం అనగా మే 27వ తేదీన థియేటర్లలో చాలా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.  ఇక ఇందులో మరో హీరోగా వరుణ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా వెంకటేష్ ఎఫ్2 సినిమా తర్వాత ఏ సినిమా చేస్తారు.. ఏ డైరెక్టర్ తో చేస్తారు.. అనే ప్రశ్నలు బాగా వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే వెంకటేష్ మరో మల్టీస్టారర్ మూవీ అయిన కభీ ఈద్ కభీ దివాళీ అనే హిందీ సినిమాలో సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ముంబై లో మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది . ఇక రెండవ షెడ్యూల్ కోసం హైదరాబాద్ కి  రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వెంకటేష్ మరో రెండు కొత్త సినిమాలు కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా దర్శకులు మాత్రం ఫైనల్  చేయలేదట. నిర్మాణ సంస్థలను ఈయన ఖరారు చేసినట్లు సమాచారం. ఇటీవల ఎఫ్ త్రీ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న వెంకటేష్ తన తదుపరి సినిమా ల వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ లో ఒక సినిమా.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మరొక సినిమా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

అయితే ఈ సినిమాలకు ఎవరు దర్శకత్వం వహిస్తారు అనే విషయం మాత్రం చెప్పలేదు . అందుకే ఈ సినిమా తరువాత దర్శకులను కన్ఫామ్ చేసే పనిలో బిజీగా మారిపోయారు వెంకటేష్. ఎఫ్ 3 సినిమా ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమో,  పాటలు అన్నీ కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: