అవెంజర్స్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల లో నటించిన మార్వెల్ కి ఎంతోమంది అభిమానులు ఉంటారు ఈ రోజుల్లో తెలుగులో కూడా ఈ సినిమాని డబ్ చేసి విడుదల చేస్తున్నారు. సదరు హాలీవుడ్ బ్యానర్ తెలుగు లో చిత్రాలను విడుదల చేస్తూ ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు. ఇప్పుడు మార్వల్ అభిమానుల జాబితాలో కొత్త పేరు వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు తెలుగులో స్టార్ హీరోయిన్ సమంత. ఈరోజు ప్రతి మార్వెల్ అభిమాని గర్వించే రీతి లో ట్వీట్ చేయడం జరిగింది.


మార్వెల్ స్టూడియోస్ థోర్ లవన్ థండర్ ట్రైలర్ని విడుదల చేయగా సమంత తనదైన శైలిలో స్పందించింది. ఈ చిత్రం క్రిస్, నటాలీ పోర్ట్మెన్, టెస్సా థాంప్సన్ మధ్య పునరాగమనం తో ఆకట్టుకుంటోంది. అయితే ట్రైలర్ లో అతి పెద్ద హైలెట్గా నిలిచింది క్రిస్టియన్ బాలే రోల్ .. గోర్ ది గాడ్ బుట్చర్ . ఇతడి లుక్కు కి సమంత విపరీతంగా ఆకట్టుకున్న ట్లుగా తెలియజేసింది. నిజానికి సమంత మొదటి హెమ్స్ వర్త్ రోల్ ని ప్రస్తావించే పోస్టర్ను కూడా షేర్ చేసింది. కొన్ని ఫైర్ ఎమోజి లతో ఆమె డెడ్ అని కూడా రాసింది.
అతని రూపాన్ని చూసి ఆమె ప్రశంసిస్తూ తన వ్యక్తిగత పోస్ట్ను భాగస్వామ్యం చేసింది. ఇక ది గాడ్ ఆఫ్ యాక్టింగ్ అంటూ.. బెల్ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా పోస్ట్ చేసింది. ఇక ఇతను అనేక mcu సినిమాలో లీడ్ రోల్ హీరోగా కనిపించారు ఇప్పుడు తాజా ముఖాలతో కలసి నటించారని ట్రైలర్ ధ్రువీకరించింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వీక్లీ తో మాట్లాడుతూ డైరెక్టర్ తైకా ఇలా అన్నారు నేను చేయకూడదు అన్నది మళ్ళీ రాగ్నారోక్ ని చేయడం ఎందుకంటే అది పూర్తి అయ్యింది.. మొత్తం విషయం వెలుగులోకి రావడానికి తను సృజనాత్మకంగా ఉద్దీపన చెందుతున్నట్లు నిర్ధారించుకోవడం కోసమే అన్నట్లుగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: