టాలీవుడ్‌లో సినిమాలు చేసేసి, నా పని అయిపోయింది, నేనింకా ప్రచారానికి రాను అని చెప్పే హీరోయిన్లు కూడా ఉన్నారు. అలా కాకుండా సినిమా ప్రచారంలో చెయ్యేసే హీరోయిన్లూ కూడా ఉన్నారు.


రెండో రకానికి చెందిన కథానాయిక తమన్నా. ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల నుండి ఆమె అలానే ఉందట. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని సినిమాల ప్రచారంలో కూడా కనిపిస్తోంది కానీ ఆమె తాజా చిత్రం 'ఎఫ్‌ 3' ప్రచారంలో మాత్రం తమన్నా కనిపించడం లేదట.అలా అని రాలేదా? అంటే తొలి రోజుల్లోనే వచ్చింది.


ఈ నెల 27న 'ఎఫ్‌ 3' సినిమాను విడుదల చేస్తున్నారు. టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత వస్తున్న ఫుల్ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్‌ సినిమా ఇది అని అందరూ చెబుతున్నారు. సినిమా ప్రచారం కూడా ఇలానే చేస్తున్నారు. ప్రచారంలో మొత్తం టీమ్‌ అంతా పాల్గొంటోందట.. నిర్మాత దిల్ రాజు ప్లానింగ్‌ అలా చేశారట మరి. అయితే తమన్నా విషయంలో ప్లానింగ్‌ చేయలేదా? లేక చేసినా వర్కౌట్‌ అవ్వలేదా అనేది తెలియడం లేదు. కారణం గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఆమె అస్సలు కనిపించకపోవడమే.


 


'ఎఫ్‌ 3' ప్రచారం అంటే వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, మెహరీన్‌, సోనాల్‌ చౌహాన్‌, అనిల్‌ రావిపూడి ప్రధానంగా కనిపిస్తున్నారట.అయితే ఇది ఇప్పుడు. సినిమా ప్రచారం స్టార్ట్‌ అయిన కొత్తలో తమన్నా ప్రచారంలో పాల్గొందట. ఈటీవీ 'క్యాష్‌'తోపాటు కొన్ని ప్రోగ్రామ్స్‌కి కూడా వెళ్లి తమన్నా సినిమా ప్రచారంలో పాల్గొంది. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆమె ఎక్కడా కూడా కనిపించడం లేదు. సినిమా టీమ్‌తో విభేదాల వల్లే ఆమె రావడం లేదని అంటున్నారు.


 


నిజానికి సినిమా ప్రచారం ప్రారంభం కావడానికి ముందే ఇలాంటి పుకార్లు కూడా వచ్చాయి. 'ఎఫ్‌ 3' విషయంలో తమన్నా కోపంగా ఉందని, ప్రచారానికి రాదు అని అన్నారుట.కానీ ఆమె వచ్చింది. దీంతో పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడింది అని అనుకున్నారు. కానీ అది కామా మాత్రమే అని ఇప్పుడు ఆమె మళ్లీ కనిపించకపోవడంతోనే అర్థమవుతోంది. అయితే మధ్యలో కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి తమన్నా వెళ్లడం వల్ల రాలేదు అని చెప్పొచ్చు. అక్కడి నుండి ఆమె తిరిగి వచ్చేసింది కూడా. కానీ ప్రచారంలోకి మాత్రం రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: