రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ మాయాజాలంలో రూపుదిద్దుకున్న ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘కల్కి 2898 AD’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కురుక్షేత్ర యుద్ధం నుంచి మొదలై, కలియుగాంతం వరకు సాగే ఈ కథలో అమితాబ్ బచ్చన్ (అశ్వద్ధామ), కమల్ హాసన్ (సుప్రీమ్ యాష్కిన్) వంటి లెజెండ్స్ నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘కల్కి 2’ గురించి వస్తున్న అప్‌డేట్స్ నెట్టింట ‘మాస్’ వైరల్ అవుతున్నాయి.


పార్ట్ 1లో అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ బచ్చన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ చూసి ఆడియెన్స్ షాక్ అయ్యారు.ప్రస్తుతం పార్ట్ 2 షూటింగ్ ఫిబ్రవరి నుంచే సైలెంట్‌గా మొదలైంది. 80 ఏళ్లు దాటినా అమితాబ్ గారు ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు ఓవర్ టైమ్ చేస్తూ యూనిట్‌ను ఆశ్చర్యపరుస్తున్నారట. అత్యంత కఠినమైన యాక్షన్ సీన్లలో కూడా అమితాబ్ బాడీ డబుల్‌ని వాడటం లేదని ఇన్ సైడ్ టాక్. స్వయంగా ఆయనే స్టంట్స్ చేస్తూ ‘అశ్వద్ధామ’ పాత్రకు ప్రాణం పోస్తున్నారు. ఈ అంకితభావం చూసి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు.



పార్ట్ 1లో సుప్రీమ్ యాష్కిన్‌గా కొద్ది నిమిషాలే కనిపించిన కమల్ హాసన్, పార్ట్ 2లో మెయిన్ విలన్‌గావిరుచుకుపడనున్నారు.తమిళ సీనియర్ నటుడు యోగిసేతు వెల్లడించిన సమాచారం ప్రకారం.. కమల్ హాసన్ ఈ సినిమా కోసం భారత్ లోనే అత్యధిక పారితోషికం పొందుతున్నారట.మొదట 20 రోజుల కాల్షీట్లకు 150 కోట్లు అనుకున్నా, నిర్మాత అశ్వనీ దత్ గారు మాత్రం అది కేవలం 10 రోజులకే అని క్లారిటీ ఇచ్చారట. అంటే రోజుకు 15 కోట్లు అన్నమాట! ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కమల్ సార్ రేంజ్ ఏంటో దీనితో అర్థమవుతోంది.



పార్ట్ 1లో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకునే, పార్ట్ 2లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని రూమర్లు వినిపిస్తున్నాయి.దీపికా స్థానంలో సౌత్ క్రేజీ స్టార్ సాయి పల్లవిని తీసుకోవాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఇది నిజమైతే, సాయి పల్లవి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ అవుతుంది.ప్రభాస్ ‘కల్కి 2’ అప్‌డేట్ రావడం అభిమానుల్లో పూనకాలు తెప్పించింది. పార్ట్ 1లో కృష్ణుడు ఎవరు? యాష్కిన్ అసలు ప్లాన్ ఏంటి? అనే ప్రశ్నలకు పార్ట్ 2లో అదిరిపోయే సమాధానాలు దొరకనున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: