త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  తప్పకుండా ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడం ఖాయమని మహేష్ అభిమానులు భావిస్తున్నారు. ఎన్నో రోజుల ఎదురు చూపుల తరువాత త్రివిక్రమ్ ఈ సినిమాను మొదలు పెట్టడానికి సిద్ధమయ్యాడు. సర్కార్ వారి పాట సినిమా ఆలస్యం అయిన కారణంగా ఈ చిత్రాన్ని మొదలు పెట్టేందుకు ఇంతటి సమయం పట్టింది.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయలు సాధించగా ఇప్పుడు చేయబోయే సినిమా హ్యాట్రిక్ విజయాను తెచ్చిపెట్టాలని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని ఓపెన్ చేసేటప్పుడు పూజ హెగ్డే ని హీరోయిన్ గా ఎంపిక చేయాలని చిత్రబృందం భావించింది. అంతేకాదు ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాల సమయంలోనూ ఆమె అతిథిగా హాజరై సినిమాను మొదలు పెట్టింది. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రంలో ఆమెను పక్కన పెట్టేశారా అని అంటున్నారు.

కారణం ఏంటో తెలియదు కానీ పూజ హెగ్డే ఈ సినిమాలో లేదు అనే వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆమె స్థానంలో ప్రియాంక మోహన్  హీరోయిన్ గా నటించబోతుందని అంటున్నారు. కొంతమంది పూజా హెగ్డే అభిమానులు ఆమెకు బదులు పూజా హెగ్డే హీరోయిన్ గా పెట్టుకుని ఉంటే బాగుంటుంది అని కూడా చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో ఈ వార్తల్లో ఎలాంటి నిజం ఉందో తెలియాలిసి ఉంది. అసలే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పూజా హెగ్డే ఇప్పుడు ఈ సినిమాను వదులుకోవడం నిజంగా ఆమె కెరీర్ పై దాని ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఆమె ఏవిధమైన నిర్ణయం తీసుకుంటుందో మరీ. ఆమె నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆమె తో సినిమాలు చేయాలంటే అందరు భయపడుతున్నారు. అది చూసుకుని పూజ హెగ్డే నిర్ణయం తీసుకుంటే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: