టాలీవుడ్ మ్యాచ్ మ్యాచ్ గోపీచంద్ హీరోగా ప్రస్తుతం పక్కా కమర్షియల్ అనే సినిమా తెరకెక్కింది. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ను విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించే దర్శకుడుగా మంచి పేరున్న దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా పై మొదటినుంచి మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా పై కూడా అంచనాలను పెంచింది. వాస్తవానికి గోపీచంద్ కి గత కొన్ని సినిమాలుగా హిట్ రావడం లేదు.

అయన నటించిన గత సినిమా సీటీమార్ పర్వాలేదనిపించుకుంది. కానీ హిట్ మాత్రం ఆశించిన స్థాయి లో రాలేదు. దాంతో తప్పకుండ గోపీచంద్ ఒక మాస్ మసాలా కమర్షియల్ హిట్ రావాల్సిన అవసరం ఉంది. ఈనేపథ్యంలో ఈ సినిమా ఆయనకు ఎంతటి హిట్ ను తెచ్చిపెడుతుందో చూడాలి. ఈ సినిమా పై ఇటు ప్రభాస్ అభిమానులు కూడా అంచనాలు పెట్టుకున్నారు. మారుతీ ఈ సినిమా తర్వాత ప్రభాస్ సినిమా చేస్తూ ఉండడంతో ఈ సినిమా హిట్ అవ్వాలని వారు కూడా కోరుకుంటున్నారు.  

రాశికన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆమెకు కూడా ఎంతో ఇంపార్టెంట్. ఆమె పాత్ర చాలా వెరైటీ గా ఉండబోతుంది అని ట్రైలర్ లోని ఆమె పాత్ర ద్వారా తెలుస్తుంది. మరి ఇంతమందికి ఎంతో అవసరమైన ఈ సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా కి జెక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులనుంచి మంచి స్పందన రాబట్టుకుందున్నాయి. ఇక ఈ సినిమా ని జులై లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. మంచి విడుదల తేదీ తో రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుని చిత్ర యూనిట్ కు మంచి పేరు తెస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: