సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రం శివాజీ. ఈ చిత్రాన్ని ఏవిఎమ్ ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 2007 జూన్ -15 న విడుదలైంది. ఈ నేపథ్యంలో అభిమానులు ఒక విషయాన్ని సోషల్ మీడియాలో చాలా ట్రెండీగా చేస్తున్నారు. శివాజీ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున స్పెషల్ డే గా దర్శకుడు శంకర్ తన కుమార్తెతో కలిసి రజనీకాంత్ నివాసంలో కలుసుకోవడం జరిగింది.

రజనీకాంత్ , శంకర్ కాసేపు మాట్లాడుకున్నట్లుగా కూడా సమాచారం .ఈ విషయాన్ని శంకర్ ట్విట్టర్ నుంచి వెల్లడించారు. రజనీకాంత్ తో ఉన్న ఫోటోను కూడా షేర్ చేయడం జరిగింది. శివాజీ చిత్రానికి 15 సంవత్సరాలు పూర్తి అయిన ఈ మరపురాని రోజున రజనీకాంత్ తో స్వయంగా కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నది అని తెలిపారు. రజిని , శంకర్ కలిసి ఉన్న ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట చాలా వైరల్ గా మారుతోంది. చాలా కాలం తర్వాత అగ్ర దర్శకుల హీరోలు ఒకే ఫ్రేమ్లో చూసిన అభిమానులు సైతం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు.


ఇక ఇద్దరూ కలిసి మరొకసారి బ్లాక్ బస్టర్ సినిమా చేయాలని.. కుదిరితే శివాజీ సీక్వెల్ సినిమాలు చేయాలని సోషల్ మీడియాలో అభిమానులు సైతం కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇక శివాజీ చిత్రం తర్వాత రజనీ కాంత్,  శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రోబో, రోబో 2.0 ఈ రెండు చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ మరొకసారి వస్తే చూడాలని ఎంతో ఆశగా చూస్తున్నారు అభిమానులు. ఇక శివాజీ చిత్రం విషయానికి వస్తే ఇందులో రజనీకాంత్ సరసన హీరోయిన్ శ్రీయ నటించింది. ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని ఏ ఆర్ రెహమాన్ అందించారు. వసూళ్ళ పరంగా ఈ చిత్రం బాగానే రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: