టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ హీరో అడివి శేష్ ఇటీవల 'మేజర్' సినిమాతో వచ్చి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా దేశావ్యాప్తంగా ప్రస్తుతం ‘మేజర్’ సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. జూన్ 3 వ తేదీన విడుదలైన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.అడివిశేష్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రంగా మేజర్ సినిమా నిలిచింది. ఈ సినిమా దాదాపు రూ.65కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి ఈ ఏడాది అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇంకా అలాగే ముంబై దాడుల్లో వీర మరణం పొందిన సందీప్ ఉన్నీకృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించాడు. మేజర్ సందీప్ పాత్రలో అడివిశేష్ నటించాడు అనడం కంటే కూడా జీవించాడు అనడం సబబు. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం శేష్ చేతిలో రెండు సినిమాలున్నాయి.అందులో ‘హిట్-2’ ఒకటి.సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020 వ సంవత్సరంలో వచ్చిన ‘హిట్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇక వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని ఈ చిత్రాన్ని నిర్మించాడు.


షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలై 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కాగా తాజాగా టాలీవుడ్ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదల తేదీ కూడా వాయిదా పడనుందట. అయితే అడివిశేష్ కోరిక మేరకు నాని ఈ చిత్రాన్ని రెండు నెలలు వాయిదా వేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది.అయితే దానికి కారణం ‘హిట్’ సినిమా హిందీ రీమేక్ జూలై 15న విడుదల కానుంది. ఒకవేళ బాలీవుడ్‌లో హిట్ మంచి విజయం కనుక సాధిస్తే రెండు నెలల గ్యాప్‌లో ‘హిట్-2’ చిత్రాన్ని కూడా తెలుగుతో పాటే హిందీలోనూ ఏకకాలంలో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇక అంతేకాకుండా అడివిశేష్‌కు ప్రస్తుతం బాలీవుడ్‌లో కొంత ఇమేజ్ కూడా ఏర్పడింది. దాంతో హిట్‌-2 సినిమాను పోస్ట్ పోన్ చేయాలని అడివిశేష్ నానిని కోరాడట. దీనిపై ఇక త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: