‘పుష్ప 2’ అత్యంత భారీ బడ్జెట్ తో చేస్తున్న పరిస్థితులలో ఈమూవీ పార్ట్ 2 కథ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వద్దని బన్నీ సుకుమార్ కు మరీమరీ చెపుతూ ఉండటంతో ఈమూవీ షూటింగ్ మొదలు కావడానికి మరో రెండు నెలల సమయం పట్టినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. దీనితో ఈమూవీ విడుదల కావడం వచ్చే సంవత్సరం డిసెంబర్ వచ్చే అవకాశం ఉంది అంటూ లీకులు వస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో అల్లు అర్జున్ గతంలో రామ్ చరణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో అనుసరించిన ప్లాన్ బి ని అనుసరించాలని ఒక స్థిరనిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ రకరకాల కారణాలతో ఆలస్యం అవుతున్న పరిస్థితులలో రామ్ చరణ్ తెలివిగా రాజమౌళి పై ఒత్తిడి పెంచి ‘ఆచార్య’ లో నటించడానికి జక్కన్న పర్మిషన్ తీసుకుని ఆమూవీని పూర్తి చేసాడు.


ఇప్పుడు అదే మార్గాన్ని అనుసరిస్తూ అల్లు అర్జున్ కూడ సుకుమార్ ను ఒప్పించి ‘పుష్ప 2’ పూర్తి అయ్యేలోగా ఒక మీడియం రేంజ్ సినిమాను తన తండ్రి అల్లు అరవింద్ నిర్మాణంలో చేయాలనే ప్రయత్నాలలో భాగంగా కొందరు యంగ్ డైరెక్టర్స్ చెపుతున్న కథలు వింటున్నట్లు టాక్. అయితే బన్నీ ఆలోచనలు బాగానే ఉన్నప్పటికీ ‘పుష్ప 2’ కోసం బన్నీ క్రియేట్ చేసుకున్న లుక్ తో మరొక మూవీని చేయడానికి సుకుమార్ అంగీకరిస్తాడా అన్నసందేహాలు కూడ ఉన్నాయి.


అల్లు అర్జున్ ప్లాన్ ప్రకారం సుకుమార్ నుండి పర్మిషన్ పొందగలిగితే ఇప్పుడు ఇదే స్ట్రాటజీ మహేష్ కూడ అనుసరించే ఆస్కారం ఉంది. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షూటింగ్ పూర్తికాగానే వచ్చే ఏడాది రాజమౌళి వైపు వెళ్ళిపోవాలి. జక్కన్న సినిమా అంటే కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది కాబట్టి మళ్ళీ మహేష్ ను చూడాలి అంటే 2025 వరకు ఆగాలి. ఈలోపున మహేష్ బన్నీ చరణ్ ల ప్లాన్ ను అనుసరించి మరొక సినిమాను ఒక యంగ్ డైరెక్టర్ తో చేసే అవకాశం కోసం బన్నీ మార్గాన్ని అనుసరించే ఆస్కారం ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: