అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా థ్యాంక్ యు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుంది. సినిమాలో నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ అంచనాలు పెంచాయి. ఇక నాగ చైతన్య ఈ థ్యాంక్ యు మూవీ అసలైతే ముందు జూలై 8న రిలీజ్ ఫిక్స్ చేశారు. మరి కారణాలు ఏమో తెలియదు కానీ సినిమా రిలీజ్ వాయిదా వేశారు.

జూలై 8 అనుకున్న థ్యాంక్ యు సినిమా కాస్త జూలై 22న రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమా వాయిదా అవడానికి కారణాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది. రాశి ఖన్నాతో పాటుగా మాళవిక నాయర్, అవికా గోర్ కూడా ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నాగ చైతన్య ఈ సినిమాతో పాటుగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో ధూత వెబ్ సీరీస్ చేస్తున్నాడు. ఈ వెబ్ సీరీస్ ని నెట్ ఫ్లిక్స్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది.

వరుస హిట్ సినిమాలతో సత్తా చాటుతున్న నాగ చైతన్య థ్యాంక్ యు తో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. థ్యాంక్ యు తో పాటుగా ధూత వెబ్ సీరీస్ వస్తుండగా తన నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట డైరక్టర్ పరశురాం డైరక్షన్ లో సినిమా ప్లాన్ చేస్తున్నాడు నాగ చైతన్య. అక్కినేని హీరోల్లో ఇప్పుడు సూపర్ ఫాం లో ఉన్న హీరో ఎవరంటే అది నాగ చైతన్య మాత్రమే. థ్యాంక్ యు కూడా హిట్ పడితే నాగ చైతన్య మరింత క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. నాగ చైతన్య పరశురాం సినిమా గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఆ సినిమా కూడా కన్ ఫర్మ్ అయితే నాగ చైతన్య ఖాతాలో మరో సూపర్ మూవీ పడినట్టే లెక్క.


మరింత సమాచారం తెలుసుకోండి: