మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో ముందుగా గాడ్ ఫాదర్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు దసరా కానుకగా రాబోతుంది. ఆ తర్వాత దీపావళికి ఆయన హీరోగా నటించిన మరొక సినిమా భోళా శంకర్ విడుదల కాబోతుంది. ఆ విధంగా ఈ ఏడాది ఆచార్య సినిమాతో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందు రాబోతున్నారు.

ఏడాదికి ఒక్క సినిమానే చేయడం గగనం అయిపోతున్న ఈ రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో ఈ విధంగా మూడు సినిమాలను ఒకే ఏడాది విడుదల చేయడం అందరినీ ఎంతగానో సంతోషపడుతుంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి మరొక సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేశాడు చిరు.  బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లూ అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర బృందం.  

ఆ విధంగా చిరంజీవి ఇలా వరుస సినిమాలు చేయడం మెగా అభిమానులను సంతోష పెడుతుంది. ఈ మూడు చిత్రాల తర్వాత కూడా ఆయన మరిన్ని సినిమాలను ఒప్పుకుని తన అభిమానులను అలరించే విధంగా వాటిని చేయబోతున్నాడు. అయితే బాబీ సినిమా లోని విలన్ పాత్ర కోసం మలయాళ విలక్షణ నటుడిని ఎంపిక చేయడం ఇప్పుడు అంతటా ఆసక్తిగా ఉంది. తెలుగులో ఇప్పటివరకు ఈ నటుడు చేయలేదు.  తొలిసారి ఆయన ఇక్కడ చేస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా ఈ సినిమా విడుదల కాబోతుందని ఈ పరిణామంతో తెలిసిపోతుంది.  మరి పాన్ ఇండియా హీరో గా ఎదిగే ప్రక్రియ ను చిరంజీవి కూడా మొదలుపెట్టినట్లు దీన్ని బట్టి తెలుస్తుంది. చిరు ఆ విధంగా సక్సెస్ అవుతారా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: