టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస క్రేజీ సినిమా ఆఫర్ లను దక్కించుకుంటూ ఫుల్ బిజీగా కెరీర్ ను కొనసాగిస్తున్న యువ హీరోయిన్ లలో కేతిక శర్మ ఒకరు. కేతిక శర్మ, ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. రొమాంటిక్ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపక పోయినప్పటికీ కేతిక శర్మ మాత్రం ఈ సినిమాలో తన హాట్ హాట్ అందాలను ఆరబోసి ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకుంది.

అలాగే ఈ సినిమాలో తన నటనతో కూడా ప్రేక్షకులను అలరించింది. రొమాంటిక్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న కేతిక శర్మ ఆ తరువాత నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన లక్ష్య సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే కేతిక శర్మ ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన రెండు సినిమాలలో ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించకపోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు మాత్రం ఫుల్ గా వస్తున్నాయి. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రంగ రంగ వైభవంగా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది.

ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తమిళ సినిమా వినోదయ సీతం కు తెలుగు రీమేక్ గా ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సాయి  ధరమ్ తేజ్ కు జోడీగా కేతికా శర్మ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్త కనుక నిజం అయితే కేతిక శర్మ మరో క్రేజీ సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: