డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాక్ స్టార్ హీరో యష్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం కేజిఎఫ్. ఈ చిత్రం ఎటువంటి ఆర్భాటాలు లేకుండా వచ్చి ఎంతో ఘన విజయాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా కలెక్షన్ల సునామిని సృష్టించింది. రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటుడుకి కూడా పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించుకున్నారు. అలా ఈ సినిమాలో కన్నడ నటుడు ఆయన అవినాష్ ముఖ్యమైన పాత్రలో నటించారు.


కేజిఎఫ్ చిత్రంతో భారీ ఇండియన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న అవినాష్ తాజాగా రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారుతూనే ఉన్నది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు విషయంలోకి వెళితే.. నిన్నటి రోజున ఉదయం 6:05 నిమిషాలకు తను కారు ప్రమాదానికి గురి అయినట్లుగా తెలియజేశారు. కానీ దేవుడి దయవల్ల ఎలాంటి చిన్న గాయాలు లేకుండా బయటపడ్డానని తెలిపారు.


అవినాష్ నిన్నటి రోజున ఒక ఈవెంట్ కి వెళ్లాల్సి ఉండగా.. సమయం దగ్గర పడుతూ ఉండడంతో కంగారులో జీపుని ఖాళీగా ఉన్న రోడ్డుపైన చాలా వేగంగా వెళ్లాడట. అదే సమయంలో అక్కడ దగ్గరలో ఒక సిగ్నల్ పడింది ఎదురుగా వస్తున్న కంటైనర్ వేగంగా వచ్చి తన కారుని ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రాణాపాయం నుంచి బయటపడింది కేవలం అభిమానుల కృతజ్ఞత వల్ల అని తెలిపారు. కానీ తన కారుకు మాత్రం భారీగా డ్యామేజ్ అయిందని నాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు,  స్నేహితులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఆ ట్రక్కు డ్రైవర్ పైన పోలీసులు విచారణ చేస్తున్నారని తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: