నాచురల్ స్టార్ నాని గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు .  నాని తాజాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం  మన అందరికీ తెలిసిం దే.  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ టాక్ ని తెచ్చుకొని డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేసింది .

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని 'దసరా' అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే . ఈ సినిమాలో నాని సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు . ఇది వరకు నాని ,  కీర్తి సురేష్ కాంబినేషన్ లో నేను లోకల్ సినిమా తెరకెక్కిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం అందుకోవడం మాత్రమే కాకుండా, వీరిద్దరి జంటకు కూడా ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు పొందిన ఈ జంట మరోసారి దసరా సినిమాలో కలిసి నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

దసరా సినిమాలో నాని తెలంగాణ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. నాని ఈ సినిమాలో రఫ్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే దసరా సినిమా షూటింగ్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయింది, అంటూ కొన్ని రోజులుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్పందిస్తూ...  దసరా సినిమా షూటింగ్ ఆగిపోలేదు.  అనుకున్నది, అనుకున్నట్లుగా జరుగుతుంది. తప్పుడు  వార్తలను ప్రచారం చేయవద్దు అంటూ కోరాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: