టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో ఒకరు అయిన సుశాంత్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుశాంత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి కాళిదాసు మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత సుశాంత్ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ చి ల సౌ సినిమా సుశాంత్ కు మంచి విజయాన్ని మరియు మంచి గుర్తింపును  తీసుకుని వచ్చింది. ఆ తర్వాత సుశాంత్ , అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలా వైకుంఠపురంలో  సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మధ్యనే సుశాంత్ హీరోగా ఇతర వాహనాలు నిలుపరాదు మూవీ లో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇలా ఇప్పటి వరకు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన సుశాంత్ తాజాగా 'మా నీళ్ల ట్యాంక్' అనే వెబ్ సిరీస్ లోనటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా విడుదల చేసిన 'మా నీళ్ల ట్యాంక్' వెబ్ సిరీస్ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ వెబ్ సిరీస్ లో సుశాంత్ సరసన ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటిస్తుండగా, వరుడు కావలెను మూవీ ఫిలిం లక్ష్మి సౌజన్య ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించింది.

ఈ వెబ్ సిరీస్ జూలై 15 వ తేదీ నుండి జీ 5 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ వెబ్ సిరీస్ లో సుశాంత్ యొక్క క్యారెక్టర్ ప్రోమోని కొద్ది సేపటి క్రితం నాచురల్ స్టార్ నాని రిలీజ్ చేసారు. ఈ వెబ్ సిరీస్ లో సుశాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఇలా ఎన్ని రోజులు పాటు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సుశాంత్ మా నీళ్ళ ట్యాంక్ వెబ్ సిరీస్ తో 'ఓ టి టి' ప్రేక్షకులను కూడా అలరించబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ లో అన్నపూర్ణమ్మ, దివి, నిరోషా, రామరాజు, సుదర్శన్, ప్రేమ్ సాగర్ తదితరులు కూడా  నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: