కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన చియాన్ విక్రమ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . విక్రమ్ కెరీర్ బిగినింగ్ లో కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించాడు . ఇది ఇలా ఉంటే విక్రమ్ 'అపరిచితుడు' మూవీ తో అదిరిపోయే విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకని తమిళ ఇండస్ట్రీ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు .

ఇది ఇలా ఉంటే తాజాగా విక్రమ్ కోబ్రా మూవీ లో  హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు యాక్షన్ థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కించాడు.  

సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను టాలీవుడ్ కి చెందిన ప్రముఖ సంస్థ ఎన్వీఆర్ సినిమా వారు దక్కించుకున్నారు. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ మూవీ ని ఆగస్ట్ 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ తో చియన్ విక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: