కొంతమంది దర్శకులకు అనుకోకుండా చాలా గ్యాప్ వస్తూ ఉంటుంది. హిట్ సినిమాలు చేసినా కూడా వారికి బ్యాడ్ లక్ ఎదురవుతూ ఉండడంతో ఈ విధమైన టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాంటి హీరోలతో కొంతమంది టాలీవుడ్ దర్శకులు ఇప్పుడు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. కారణమేదైనా కూడా వారు తమ సినిమాలను త్వరగా ఓకే చేసుకొని షూటింగ్ కు వెళ్లే విషయంలో మాత్రం విఫలం అవుతున్నారు. 

పెద్ద దర్శకులకు సైతం ఈ విధమైన ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. అలాంటి వారిలో ఒకరు త్రివిక్రమ్. ఆయన అల వైకుంఠపురంలో సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న కూడా ఇప్పటివరకు తన తదుపరి సినిమాను మొదలు పెట్టలేకపోవడం నిజంగా ఆయన దురదృష్టం అనే చెప్పాలి. మహేష్ బాబుతో సినిమాను అనౌన్స్ చేసి ఆరు నెలలు దాటుతున్న కూడా ఇంకా ఆ చిత్రాన్ని మొదలు పెట్టకపోవడం ఆయన అభిమానులను నిరాశ పరుస్తుంది. తాజాగా ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ ను ఫైనల్ నరేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. 

దర్శకుడు హరీష్ శంకర్ కూడా తన తదుపరి చిత్రాన్ని ఓకే చేసుకోవడానికి ఎంతో సమయం తీసుకున్నాడు. సినిమా ఓకే చేసుకున్నాక షూటింగ్ వెళ్లడానికి ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. భవదీయుడు భగత్ సింగ్ ఎప్పుడో అనౌన్స్ కూడా ఇంకా ఈ చిత్ర సెట్స్ పైకి వెళ్ళకపోవడం ఆయన అభిమానులను నిరాశ పరుస్తుంది. చిరంజీవి సినిమా దర్శకుడు బాబీ కూడా చాలా రోజుల నుంచి తన తదుపరి సినిమాను మొదలు పెట్టడానికి ఎదురుచూస్తున్నాడు.  త్వరలోనే ఈ సినిమా షూటింగుకు వెళ్లబోతుంది అని అంటున్నారు. వీరే కాదు త్రివిక్రమ్ ను ఎన్టీఅర్, వేణు శ్రీరాం ను అల్లు అర్జున్, వెంకీ కుడుముల ను చిరంజీవి, రామ్ చరణ్ గౌతమ్ తిన్న నూరి ని వెయిట్ చేయించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: