ప్రతి హీరో కెరియర్ల ఎన్నో కొన్ని చిత్రాలు హిట్ అవుతూనే ఉంటాయి. మరికొన్ని సినిమాలు ప్లాప్ అవుతూనే ఉంటాయి ఎక్కువ శాతం మంది హీరోలు తాము ఆ సినిమా చేయకుంటే బాగుండేది అని ఆంటు ఉండేవారు చాలామంది ఉంటారు. ఇలాంటి విషయంలో హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్స్ సైతం కూడా అప్పుడప్పుడు ఆ పాత్రలో ఎందుకు నటించాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ బాలీవుడ్ హీరో మాత్రం తాను నటించిన చిత్రాలు అన్ని గొప్ప చిత్రాలు అని తెలియజేస్తున్నారు ఆ హీరో గురించి తెలుసుకుందాం.


హీరో ఎవరో కాదు బాలీవుడ్ రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రణబీర్ కపూర్. తను ఇప్పటికీ ఏ సినిమా గురించి ఈ విధంగా ఆలోచించలేదని.. ఏ ఒక్క పాత్ర కూడా తనకు అసంతృప్తిగా కలగలేదని తెలిపాడు తాను ఫలానా పాత్ర చేసి ఉంటే మంచి సక్సెస్ అయ్యేది అని ఏనాడు కూడా పశ్చాత్తాపం పడలేదని తెలిపారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ ఈ వాక్యాలు చేయడం జరిగింది.


తన సినిమాల గురించి చెప్పుకోవడమే కాకుండా తన పిల్లలు చూడని సినిమాలను కూడా వారితో కలిసి చూడలేని సినిమాలను కూడా నేను ఇప్పటివరకు అలాంటి పని అస్సలు చేయలేదు.. చేయబోను అని కూడా తెలిపాడు. తను నటిస్తున్న ఏ ఒక్క సినిమా అయినా కూడా తనకి ఒక స్ఫూర్తి లాంటిది అని తెలియజేశాడు. ప్రేక్షకులకు వినోదం పంచడం కోసం ఎవరిని కించపరచాల్సిన అవసరం లేదు ఎవరి మనోభావాలను కూడా దెబ్బతీయాల్సిన అవసరం లేదని తెలియజేశాడు. కేవలం సినిమా అనేది సమాజం పట్ల కాస్త ప్రభావం చూపిస్తుంది కనుక కథలో ఎంపిక చేసుకునే పాత్ర గురించి ఆలోచిస్తాను ఆ తర్వాతే నిర్ణయాన్ని తీసుకుంటానని తెలియజేశాడు రణబీర్ కపూర్.

మరింత సమాచారం తెలుసుకోండి: