ఇటీవల విడుదలైన చాలా సినిమాల కన్నా కేవలం ఒకే ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. తమిళ మాతృక కలిగిన విక్రమ్... అన్ని భాషలలో విడుదలైన విషయం తెలిసిందే. ఎంతలా అంటే... తమిళ్ లో అయితే కలెక్షన్ లు బాగా వచ్చి ఉంటే ఒకే...కానీ విడుదలైన అన్ని భాషలలోనూ అద్భుతమైన కలెక్షన్ లను సాధించింది. కానీ ఈ క్రెడిట్ అంతా కూడా యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఈ సినిమా హిట్ అవడంతో ఇందులో హీరోగా నటించిన కమల్ హాసన్ కు చాలా కాలం తర్వాత సరైన హిట్ దక్కింది. దీనితో కమల్ ఫుల్ ఖుషీ అయ్యాడు. ఈ సంతోషంతో మూవీ యూనిట్ కు బహుమతులు కూడా ఇచ్చాడు.

అయితే ఇప్పుడు విక్రమ్ తర్వాత ఈ నెలలో రానున్న సినిమాలు కూడా అదే స్థాయి ఫలితాన్ని అందుకుంటాయా అన్న ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో స్టార్ట్ అయింది.  కాగా రిలీజ్ కానున్న సినిమాలలో ముందుగా మనము చెప్పుకోవాల్సింది రామ్ నటించిన 'ది వారియర్' గురించి... ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన పోస్టర్, టీజర్, సాంగ్స్ మరియు ట్రెయిలర్ అన్నీ కూడా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్న భావనను కలిగించాయి. అయితే విక్రమ్ స్థాయి హిట్ ను అంధిస్తుందా  అన్నదే ఇప్పుడు సందేహంగా మారింది.

మామూలుగా ఎప్పటి నుండో తెలుగు ప్రేక్షకులలో ఉన్న ఒక భావన ఏమిటంటే... తమిళ డైరెక్టర్ నుండి సినిమా అంటే మాస్ అంశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మాస్ కూడా మరీ అతిగా ఉంటే తెలుగు ప్రేక్షకులు అంగీకరించరు. అయితే డైరెక్టర్ లింగుస్వామి మాస్ అంశాలను సమపాళ్లలో కలిపి తెరకెక్కించారా లేదా అన్నది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ఈ సినిమా మరో రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విక్రమ్ అంత హిట్ కాకపోయినా... మోస్తరు విజయాన్ని అందుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: