రామ్ పోతినేని పోలీస్ గా పవర్ ప్యాకెడ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నాడని ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. కాగా రామ్ ఇందులో పూర్తి సినిమా అంతా పోలీస్ పాత్ర చేయడం లేదట. ఇంతకు ముందు చాలా సినిమాలలో చూపించిన విధంగానే ఫస్ట్ హాఫ్ అంతా మామూలు పాత్రలో మరియు సెకండ్ హాఫ్ లో మాత్రమే పోలీస్ పాత్రలో అలరిస్తాడని తెలుస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... రామ్ మొదట్లో డాక్టర్ గా కనిపిస్తాడట. అయితే ఈ నేపథ్యంలో అతని కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. ఒక నిస్సహాయుడైన డాక్టర్ గా తాను సాధించలేని దానిని ... పోలీస్ గా మారి సాధిస్తాడని తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ట్విస్ట్ కూడా అందరినీ ఎంతగానో అలరిస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ఇలా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో రామ్ అద్భుతంగా నటించాడట. ఇక రామ్ కు ధీటుగా ఇందులో విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటించాడు. అయితే ఇప్పటి వరకు వస్తున్న వార్తల ప్రకారం ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేయడం లేదట. మరి రేపు విడుదల కానున్న ఈ సినిమాలో ఇంకెన్ని ట్విస్ట్ లు ఉన్నాయో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి