వందలాది కోట్ల ఆస్థి ఉన్నప్పటికీ అతడి పేరు అందరికీ తెలియాలని కొందరు ఆరాట పడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు చాల సులువుగా పేరు తెచ్చిపెట్టే ఏకైక సాధనం సినిమా. ఇప్పుడు అరుళ్ శరవణన్ పేరు దక్షిణాది యావత్తు మారుమ్రోగి పోతోంది. తమిళనాడు రాష్ట్రంలో శరవణన్ సిల్క్స్ పేరు ఎరగని వారుండరు.


మూడువేల రూపాయల నుండి 30 లక్షల రూపాయల విలువైన పట్టు చీరలు శరవణన్ సిల్క్స్ లో దొరుకుతాయి. 10వేల మందికి పైగా సిబ్బంది శరవణన్ గ్రూపుకు సంబంధించిన ఆరుళ్ స్టోర్స్ లో పనిచేస్తారు. వేలాది కోట్ల రూపాయల ఆస్థి ఉన్నప్పటికీ సినిమాలలోకి రావాలన్న కోరిక ఆరుళ్ కు ఉండటంతో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.


తన మొదటి సినిమాని 60 కోట్ల భారీ బడ్జెట్ తో చాల రిచ్ గా ఆరుళ్ తీసాడు. 52 సంవత్సరాల వయస్సులో తన మొదటి సినిమాను నటించడమే కాకుండా గ్లామర్ హీరోయిన్స్ ఊర్వశి రౌతాల లక్ష్మీరాయ్ లాంటి హీరోయిన్స్ ను పక్కన పెట్టుకుని తాను హీరోగా సరిపోతానా లేదా అన్న ఆలోచన పెట్టుకోకుండా ఇతడు నిర్మించిన మూవీ ‘లెజెండ్’ పేరుతో డబ్ చేయబడి విడుదల అయింది. ఈసినిమాకు సంబంధించిన పాటలు పంచ్ డైలాగ్ లు చిన్న బిట్స్ గా కట్ చేసి అన్ని ప్రముఖ ఛానల్స్ లో యాడ్స్ గా ప్రసారం చేస్తున్న పరిస్థితులలో ఇతడి పేరు తెలుగు వారికి కూడ బాగా తెలిసిపోయింది.


అయితే ఇతడి ఉత్సాహాన్ని చూసి బిత్తరపోతున్న నెటిజన్ లు ఆరుళ్ శరవణన్ తో ఆటాడుకుంటున్నారు. ఇలాంటి సినిమాలలో నటించి 60 కోట్లు వృధాగా ఖర్చు చేసుకునే బదులు ఆడబ్బు పేదవారి కోసం ఖర్చు పెడితే ఆరుళ్ పేరు దేశవ్యాప్తంగా తెలిసేది కదా అంటూ అతడి పై సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అయితే ఈ సెటైర్లను పట్టించుకునే స్థితిలో ఆరుళ్ శరవణన్ ఉన్నట్లు కనిపించడం లేదు..



మరింత సమాచారం తెలుసుకోండి: