సమ్మర్ తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీ కనీవిని ఎరుగని స్లంప్ ను ఎదుర్కుంటోంది. జాన్ మొదటివారంలో వచ్చిన ‘మేజర్’ ‘విక్రమ్’ లు తరువాత విడుదలైన అన్ని సినిమాలు ఫ్లాప్ లుగా మారడంతో బయ్యర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఖాళీగా కనిపిస్తున్న ధియేటర్లను చూసిన ఇండస్ట్రీ వర్గాలు ఇక సినిమాలకు ప్రేక్షకులు రారా అన్న సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.


భారీ అంచనాలతో విడుదలైన రవితేజా ‘రామారావు ఆన్ డ్యూటీ’ కంటే ‘ఈగ’ సుదీప్ నటించిన ‘విక్రాంత్ రాణా’ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగు ప్రేక్షకులు కథ బాగుంటే డబ్బింగ్ సినిమాలను కూడ బాగా ఆదరిస్తారు అన్న విషయం మరొకసారి రుజువైంది. జూలై నెల గడిచి పోవడంతో ఇక అందరి దృష్టి ఆగష్టు నెలపై పడింది. ఈ నెలలో చాల మీడియం రేంజ్ సినిమాలతో పాటు భారీ సినిమాలు కూడ విడుదల అవుతున్నాయి.


ఈ సినిమాలలో కనీసం రెండు సినిమాలు అయినా హిట్ కాకపోతే ఇండస్ట్రీ పరిస్థితి మరింత గందరగోళంలో పడే ఆస్కారం ఉంది. ఆగష్టు మొదటి వారంలో రాబోతున్న 'బింబిసార’ ‘సీతా రామం’ సినిమాల మధ్య పోటీ అత్యంత ఆశక్తికరంగా మారింది. కన్నడ హీరో దుల్కర్ సల్మాన్ డైరెక్ట్ గా నటిస్తున్న మూవీతో కళ్యాణ్ రామ్ చాల దైర్యంగా పోటీ పడుతున్నాడు.


జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగి తన అభిమానులను కళ్యాణ్ రామ్ సినిమాను చూడండి అంటూ ప్రమోట్ చేస్తున్నప్పటికీ ఎంతవరకు తారక్ అభిమానులు కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ కోసం ధియేటర్లకు వెళతారు అన్న విషయమై కన్ఫ్యూజన్ ఉంది. ఈ రెండు సినిమాలు విడుదలైన కేవలం వారం రోజుల గ్యాప్ లో నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ నిఖిల్ ‘కార్తికేయ 2’ ఒకదాని పై ఒకటి పోటీ పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ నాలుగు సినిమాలలో ఏఒక్కటి సూపర్ హిట్ కాకపోయినా ఇండస్ట్రీ పరిస్థితి మరింత అయోమయంలో పడిపోయే ఆస్కారం ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: