టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సంవత్సరం ప్రారంభంలోనే సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇలా బంగార్రాజు మూవీ లో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న నాగార్జున 'బంగార్రాజు' మూవీ కంటే ముందే ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే మూవీ షూటింగ్ ని ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మొదట హీరోయిన్ గా చిత్ర బృందం కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసుకుంది. 

ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కాజల్ అగర్వాల్మూవీ నుండి తప్పుకుంది. అలా కాజల్ అగర్వాల్మూవీ నుండి తప్పుకోవడంతో ఈ మూవీ యూనిట్ మరో కొత్త హీరోయిన్ కోసం చాలా ప్రయత్నాలు చేసినట్లు అప్పట్లో అనేక వార్తలు బయటకు వచ్చాయి.  చివరకు ది ఘోస్ట్ మూవీ యూనిట్ సోనాల్ చౌహాన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకుంది. సోనాల్ చౌహాన్ 'ది ఘోస్ట్' మూవీ యూనిట్ లో జాయిన్ అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతూ వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ది ఘోస్ట్ మూవీ నుండి మూవీ  మేకర్స్ ఒక అప్డేట్ ను విడుదల చేసింది.

తాజాగా ది ఘోస్ట్ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో నాగార్జున మరియు సోనాల్ చౌహాన్ ఉన్నారు. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: