రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా , రవి బుస్రుర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు . ఈ మూవీ లో మలయాళ స్టార్ నటుడు పృథ్వి రాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో కనిపించ బోతున్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సలార్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు విషయం లోకి వెళితే ...  కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయిన యాష్ 'సలార్' మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు అలాగే , సలార్ మూవీ లో 10 నిమిషాల నిడివి గల పాత్రలో యష్ కనిపించనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యాష్ మరో సారి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో నటిస్తున్నాడు అన్న వార్త బయటకు రావడంతో సలార్ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇది ఇలా ఉంటే సలార్ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తి అయ్యింది. ఈ మూవీ ని దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో యాక్షన్ సన్నివేశాలు అద్భుతమైన రీతిలో ఉండబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: