టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న హీ రోలలో ఒకరు అయినా సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . చిన్న చిన్న పాత్ర లతో కెరీర్ ను ప్రారంభించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక సినిమాల్లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా వీలు చిక్కిన ప్పుడల్లా కొన్ని సినిమా లలో ముఖ్యమైన పాత్రల్లో కూడా నటిస్తున్నాడు . అందులో భాగంగా కొంత కాలం క్రితమే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర కెక్కిన ఆచార్య మూవీ లో సత్యదేవ్ ఒక కీలక పాత్రలో నటించాడు . అలాగే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ లో కూడా ఒక చిరంజీవి ఒక ముఖ్య మైన పాత్రలో కనిపించ బోతున్నాడు . సత్యదేవ్ కొంత కాలం క్రితమే గాడ్సే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. 

కాకపోతే ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా సత్యదేవ్ 'గుర్తుందా శీతాకాలం' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో తమన్నా హీరోయిన్ గా నటించింది. మరి కొన్ని రోజుల్లో  ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ మూవీ తో పాటు సత్యదేవ్ 'కృష్ణమ్మ' అనే మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి వి.వి గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు కొరటాల శివమూవీ ని సమర్పించుకున్నాడు. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ నుండి 'ఏమవుతుందో మనలో' అనే సాంగ్ ని ఆగస్ట్ 19 వ తేదీన ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: