ప్రభాస్ తో సినిమా చేయడం అంటే నిజంగా ఎంతో గొప్ప విషయం అనే చెప్పాలి. ముఖ్యంగా పెద్ద దర్శకులకు అయితే ఇది గొప్ప వరం. ఇటీవల కాలంలో ప్రభాస్ మీడియం రేంజ్ దర్శకులతో సినిమాలు చేయడం జరుగుతుంది. ఒకరిద్దరూ పెద్ద దర్శకులతో సినిమాలు చేస్తున్న సమయంలోనే మీడియం రేంజ్ దర్శకులతో ఆయన సినిమాలు చేయడం జరుగుతుంది. ఆ విధంగా రాజమౌళి దర్శకత్వంలో చేసిన బాహుబలి సినిమా తర్వాత ఆయన ఇద్దరు మీడియం దర్శకులతో సినిమాలు చేశారు. వారే సుజిత్ మరియు రాధాకృష్ణ.

వీరిద్దరూ కూడా ప్రభాస్ తో సినిమాలు చేసి మంచి ఫలితాలను అందుకోలేకపోయారు. ఫలితంగా ప్రభాస్ అభిమానులు వారిని ఎంతగానో ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. గతంలోనూ మీడియం రేంజ్ దర్శకులతో సినిమాలు చేసిన ప్రభాస్ వారి ద్వారా మంచి విజయాలనైతే అందుకోలేకపోయాడు. అయితే అలా ప్రభాస్ కు ఫ్లాప్ అందించిన చాలామంది దర్శకులు మళ్ళీ కోలుకోలేకపోయారు. తర్వాత సినిమాను రాబట్టుకోలేకపోయారు. ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు దానిని వినియోగించుకోవాల్సింది పోయి సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం అవుతున్నారు.

అలాంటి దర్శకులకు ఇలాగే జరగాలి అని కొంతమంది ప్రభాస్ అభిమానులు చెబుతున్నారు. ఒక పెద్ద స్టార్ హీరోతో సినిమా చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా కాకుండా వారు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగ పరుచుకోవడం నిజంగా వారి అలసత్వానికి నిదర్శనం అనే వారు చెబుతున్నారు. మరి వరుసగా రెండు పరాజయాలను తెచ్చుకున్న ప్రభాస్ మళ్ళీ రాబోయే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతాడు అనేది చూడాలి. మరి రాధేశ్యామ్ అంతకుముందు చేసిన సాహూ సినిమాల దర్శకులకు ఇప్పటివరకు ఏ హీరో కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ ఎవరిస్తారో అనేది చూడాలి. అసలు వీరిలో మంచి దర్శకత్వ ప్రతిభ ఉన్నా కూడా రాంగ్ కథ ల సెలక్షన్ వల్ల ఈ సినిమా లు వారికి ఏమాత్రం ఉపయోగపడడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: