నటుడు నాజర్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే తాజాగా ఆయన ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో చిన్నపాటి యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తున్నది. అందులో ఆయన గాయపడినట్లు సమాచారం షూటింగ్లో భాగంగా యాక్సిడెంట్ చోటు చేసుకున్నట్లు సమాచారం నాజర్ నటిస్తున్న ఒక సినిమా షూటింగ్ పోలీస్ అకాడమీ లో జరుగుతున్నది నిన్నటి రోజున ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో మెట్లు దిగుతూ ఉండ సందర్భంగా ఆయన కాలుజారి కింద పడడం జరిగింది దీంతో ఆయనకు తీవ్రమైన గాయాలు అయినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత వెంటనే అక్కడున్న సిబ్బంది ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.


ఇక ఈ నటుడు త్వరగా కోలుకోవాలని నాజర్ అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు నాజర్ తో పాటు సుహాసిని, మెహ్రిన్ , సియాజి షిండే  వంటి నటులు కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లుగా తెలుస్తున్నది. ఇక ఈ మధ్యకాలంలో నాజర్ పలు వార్తలలో నిలుస్తూ ఉన్నారు మొన్నటికీ మొన్న ఆయన సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు వార్తలు బాగా వినిపించాయి. ఇక అందుకు కారణం ఆయనకు కొన్ని అనారోగ్య సమస్యలు అన్నట్లుగా సమాచారం.లాక్డౌన్ సమయంలో నాజర్ గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నట్లుగా సమాచారం.అందుచేతనే సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలనుకున్నానని  అదేవిధంగా కామెంట్లు వినిపించాయి కానీ ఈ వార్తలను మాత్రం తన భార్య ఖండించింది ఆయనకు సినిమా అనేది ఊపిరి వంటిది దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయకండి అంటూ ఆమె క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం నాజర్ ఇలాంటి ఘటన జరగడంతో పలువురు అభిమానులు సైతం తను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. నాజర్ ఎన్నో కష్టాలు పడి సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: