మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు ఆయన సల్మాన్ ఖాన్ ఒక ముఖ్య పాత్రలో నటించగా , లేడీ సూపర్ స్టార్ నయన తారమూవీ లో చిరంజీవి కి చెల్లెలి పాత్రలో నటించింది. అలాగే ఈ మూవీ లో సత్యదేవ్ కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా సందర్భంగా అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా గాడ్ ఫాదర్ చిత్ర బృందం ఈ సినిమా టీజర్ ను తెలుగు తో పాటు హిందీ లో కూడా విడుదల చేసింది.

ఈ టీజర్ కు తెలుగు మరియు హిందీ భాషల్లో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. విడుదల అయిన 24 గంటల్లో గాడ్ ఫాదర్ మూవీ తెలుగు టీజర్ 8.71 మిలియన్ వ్యూస్ ని , 388 కే లైక్ లను సాదించింది. విడుదలయిన 24 గంటల్లో గాడ్ ఫాదర్ మూవీ హిందీ టీజర్ 2.53 మిలియన్ వ్యూస్ ని , 118.8 కే లైక్ లను సాధించింది.  ఓవరాల్ గా చూసుకుంటే గాడ్ ఫాదర్ మూవీ టీజర్ కు తెలుగు మరియు హిందీ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది అని చెప్పవచ్చు. ఈ మూవీకి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ తో మెగాస్టార్ చిరంజీవి ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: