సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే . తాజాగా విడుదలైన సర్కారు వారి పాట మూవీ తో కూడా మహేష్ బాబు మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు . ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ బాబు మరి కొన్ని రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుండగా , ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని అందించిబోతున్నాడు.

ఇది వరకు మహర్షి మూవీ లో పూజా హెగ్డే మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా మహేష్. బాబు కెరీర్ లో ఇది 28 వ సినిమాగా తెరకెక్కబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి రోజుకో రూమర్ బయటకి వస్తోంది. మొదట ఈ మూవీ ని కేవలం తెలుగు భాషలో మాత్రమే విడుదల చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఈ మూవీ ని తెలుగు తో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో కలుపుకొని పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నట్లు మరో వార్త వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగు లో తెరకెక్కించి తమిళ్ లో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: