మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుత మైన క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్ కొంత కాలం క్రితం విడుదల ఆయన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా తన పాపులారిటీని పెంచుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక హీరో గా నటించగా ,  దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మూవీ కి దర్శకత్వం వహించాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయిన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ తర్వాత జెర్సీ మూవీ తో ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ లో రామ్ చరణ్  నటించనున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ , వేణు శ్రీరామ్ దర్శకత్వంలో యు వి క్రియేషన్స్ బ్యానర్ లో ఒక మూవీ లో నటించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో యు వి క్రియేషన్స్ బ్యానర్ లో తేరకేక్కబోయే మూవీ లో రామ్ చరణ్ నటించిన బోతున్నాడు అనే వార్త పూర్తిగా అవాస్తవం అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: