ప్రస్తుతం మాస్ మహారాజా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తాడు అనే విషయం ఆయన ఫ్యాన్స్ కు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులకు అందరికి తెలుసు..ఈయనకు హిట్ వచ్చి ఫామ్ లోకి వచ్చాడు అని అనుకునే లోపే వెంటనే మరో ప్లాప్ తో డిజాస్టర్ అందుకుంటూ ఆయన ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తున్నాడు.ఇకపోతే  ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యి భారీ నష్టాలను కూడా మిగిల్చాయి.ఇప్పుడు ఈయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యాడు. రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా' సినిమా చేస్తున్నాడు. 

ఇక ఈ సినిమాను కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. రవితేజ చేసిన వరుస సినిమాలు పరాజయం కావడంతో ఈ సినిమాలో కీలక మార్పులు చేర్పులు చేసి మరింత ఫోకస్ పెట్టి తెరకెక్కించినట్టు తెలుస్తుంది.ఇప్పటికే వచ్చిన ప్రొమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాకు డబుల్ ధమాకా అనే టైటిల్ ను ఎందుకు పెట్టారు అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది..అయితే  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు డబుల్ ధమాకా అనే పేరు పెట్టడానికి కారణం ఈ సినిమాలో ఇద్దరు రవితేజ లు కనిపిస్తారట..

ఇక ఈయన రెండు విభిన్నమైన గెటప్స్ లో ఆడియెన్స్ ను అలరించడానికి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు టాక్.ఇక దీన్ని బట్టి చుస్తే ఈయన ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా కనిపిస్తాడు అని తెలుస్తుంది. ఈ సినిమా షూట్ పూర్తి చేసుకోగా.. దీపావళి కానుకగా రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారట.. ఈ సినిమాలో రవితేజకు జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుండగా.. వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. ఈ సినిమా అయినా రవితేజ కెరీర్ లో హిట్ అవుతుందో లేదో చూడాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: