బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి తాజాగా భారీ అంచనాల నడుమ బ్రహ్మాస్త్ర అనే మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రన్బీర్ కపూర్ హీరోగా నటించిన ,  ఆలియా భట్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. అయాన్ ముఖర్జీమూవీ కి దర్శకత్వం వహించాడు.  అమితా బచ్చన్ ,  నాగార్జున ,  మౌని రాయ్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలో నటించారు.  భారీ అంచనాల నడుమ విడుదల అయిన బ్రహ్మాస్త్ర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.

మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు. తెలుగు లో ఈ మూవీ ని బ్రహ్మాస్త్రం అనే పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ ని దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెలుగు లో సమర్పించాడు. టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర బ్రహ్మాస్త్రం మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన బ్రహ్మాస్త్ర సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ...  బ్రహ్మాస్త్ర మూవీ 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకున్నట్లు ,  అక్టోబర్ రెండవ వారం నుండే ఈ మూవీ ని డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ,  మరి కొద్ది రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: