సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటులుగా సెటిల్ అయినవారు వారి కుటుంబ సభ్యులను ఇండస్ట్రీకి వారసులుగా పరిచయం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో జబర్దస్త్ లో కూడా ఇలాంటిదే జరుగుతోంది. జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు వారి కుటుంబ సభ్యులను ఇక జబర్దస్త్ లోకి తీసుకువస్తూ ఇక వారికి కూడా ప్రత్యేకమైన సెలబ్రిటీ హోదాను కల్పిస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవలే ఇలా జబర్దస్త్ లో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు రాకెట్ రాఘవ కొడుకు మురారి. జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో కామెడీ పంచలతో అదరగొడుతున్నాడు అని చెప్పాలి.


 ఏకంగా తన తండ్రి రాకెట్ రాఘవ పై కూడా పంచులు వేస్తూ తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నాడు. తద్వారా ఇక ఇప్పుడు తండ్రి బ్యాక్ గ్రౌండ్ తో జబర్దస్త్ లోకి ఎంటర్ ఇచ్చి ఇక ఇప్పుడు ఒక సెలబ్రిటీగా మారిపోయాడు మురారి. కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. తన తండ్రిపై మాత్రమే కాకుండా అందరి కమెడియన్స్ పై కూడా తనదైన కామెడీ టైమింగ్ తో పంచులు వేస్తూ ఇక ప్రేక్షకులు అందరినీ కూడా కడుపుబ్బా నవ్విస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇలా జబర్దస్త్ లో బాగా పాపులారిటీ సంపాదించుకున్న రాకెట్ రాఘవ కొడుకు మురారి అటు భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు  అన్నది తెలుస్తుంది. మురారి ఏదైనా స్కిట్లో పర్ఫామెన్స్ చేస్తే తనకు టీం లీడర్స్ లేదా మల్లెమాల నుండి ఏకంగా 5000 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. తన పాత్ర కాస్త నిడివి ఎక్కువగా ఉంటే పదివేల వరకు తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ బుడ్డోడు ఈ వయసులోనే ఒక్క కాల్ షీట్ కి పదివేల రూపాయలు సంపాదిస్తున్నాడు అంటే ఇక అతనికి తిరుగులేదు అంటూ ఎంతో మందిని ఈ విషయం తెలిసి కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: