అల్లు ఫ్యామిలీ హైదరాబాద్ నగర శివారులో ఒక భారీ స్టూడియోను నిర్మిస్తున్నట్లుగా గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు స్టూడియోస్ పేరుతో ఈ స్టూడియోని అల్లు రామలింగయ్య జయంతి పురస్కరించుకునే రెండు సంవత్సరాల క్రితమే ఈ పనులను మొదలుపెట్టారు.అయితే ఈ స్టూడియో ఇప్పుడు తాజాగా నిర్మాణ పనులను పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అల్లు రామలింగయ్య 100 వ జయంతి సందర్భంగా ఈ రోజున అల్లు స్టూడియోని ప్రారంభించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది.


ఈ వేడుకకు చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. చిరంజీవి చేతుల మీదుగానే ఈరోజు ఉదయం 10 గంటలకు ఈ స్టూడియోని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్టూడియోని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సారధ్యంలో తన కుమారుడు అల్లు బాబి, అల్లు అర్జున్, అల్లు శిరీష్  నిర్మిస్తున్నారు. ఇక స్టూడియో అందుబాటులోకి రావడంతో చాలా గ్రాండ్ గా ఈ స్టూడియో ని ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓపెనింగ్ కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో చిరంజీవి తో పాటు అల్లు అరవింద్ అల్లు అర్జున్, అల్లు బాబి అల్లు శిరీష్ తదితర కుటుంబ సభ్యులు కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.


ఇక అల్లు రామలింగయ్య పేరు మీద ఒక పుస్తకాన్ని కూడా ఆవిష్కరించబోతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నట్లు సమాచారం. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇతర ప్రముఖులు కూడా ఇందులో హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలను చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా స్టూడియో ఓపెనింగ్ చేయాలని అల్లు ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులోని కొత్తపేట నార్సింగ్ సమీపంలో ఆల్లు స్టూడియోని నిర్మించబోతున్నారు. దాదాపుగా 10 ఎకరాలలో ఈ స్టూడియో నిర్మాణం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ స్టూడియో అత్యధిక టెక్నాలజీతో ప్రపంచ స్థాయి సదుపాయాలతో నిర్మించినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: