బుల్లితెర యాంకర్ వర్షిణి  అందరికి తెలుసు. ఈమె ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో షోలు చెయ్యకపోయినా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. అంతేకాదు పలు సినిమాలలో, వెబ్ సిరీస్ లలో వర్షిణి నటించగా అవి కూడా వర్షిణికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.ఇకపోతే వర్షిణికి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా త్వరలో ఆమె పెళ్లి పీటలెక్కనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.అయితే వర్షిణి దృష్టి పెట్టడం లేదు కానీ వర్షిణి దృష్టి పెడితే ఆమెకు సినిమా ఆఫర్లు ఊహించని స్థాయిలో పెరగడం గ్యారంటీ అని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక  త్వరలో వర్షిణి కోటీశ్వరుడి ఇంటికి కోడలు కాబోతుందని తన బంధువునే ఆమె పెళ్లి చేసుకోనున్నారని సమాచారం అందుతోంది. అంతేకాదు వరుసకు బావ అయ్యే వ్యక్తిని వర్షిణి పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది.ఇక  వర్షిణి మనసులో కూడా ఆమె బావ ఉన్నాడని సమాచారం.అయితే  భారీ ప్రాజెక్ట్ లలో ఆఫర్లు రాకపోవడంతో వర్షిణి పెళ్లికి ఓకే చెప్పిందని సమాచారం అందుతోంది. కాగా ఈ నెల చివరి వారంలో వర్షిణి నిశ్చితార్థం జరగనుందని ఆ సమయంలోనే పెళ్లి తేదీకి సంబంధించి వర్షిణి వెల్లడించనున్నారని తెలుస్తోంది.ఇక  వర్షిణి పెళ్లి చేసుకోనున్నారని తెలిసి కొంతమంది

 ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతుంటే కొంతమంది అభిమానులు మాత్రం బాధ పడుతున్నారు.అయితే వర్షిణి రెమ్యునరేషన్ రోజుకు లక్ష రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది. అంతేకాదు ఇతర యాంకర్లు గట్టి పోటీ ఇస్తుండటం వల్లే వర్షిణికి సినిమా ఆఫర్లు ఆశించిన స్థాయిలో రావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.అయితే   వర్షిణి బావ సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పని చేస్తారని వర్షిణి బావకు భారీమొత్తంలో ఆస్తులు ఉన్నాయని బోగట్టా. ఇక వైరల్ అవుతున్న వార్తల గురించి వర్షిణి స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: