సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మహేష్ బాబు ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా తేరకెక్కుతోంది. ఈ మూవీ మహేష్ బాబు ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ మూవీ. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. దసరా తర్వాత అక్టోబర్ 10 వ తేదీ నుండి ఈ మూవీ రెండవ షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే సూర్యదేవర నాగవంశీ తాజాగా స్వాతిముత్యం అనే సినిమాకు కూడా నిర్మాతగా వివరించాడు  ఈ సినిమా అక్టోబర్ 5 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ విడుదల సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సూర్యదేవర నాగవంశీ ,  మహేష్ బాబు మూవీ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ని చెప్పు కొచ్చాడు.  మహేష్ బాబు మూవీ లో ఐటమ్ సాంగ్ ని పెట్టమని దర్శకుడిని రిక్వెస్ట్ చేస్తున్నట్లు సూర్యదేవర నాగవంశీ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: