సినిమా వాళ్ళ జీవితాలు రంగుల ప్రపంచమే అని అంతా అనుకుంటారు. కానీ సామాన్యుల కంటే కూడా ఎక్కువ కష్టాలు వారికి ఎదురవుతూ ఉంటాయి. ఇవి ఎక్కువగా పైకి కనిపించవు


పైకి మేకప్ వేసుకుని వారు ఎంత అందంగా కనిపించి నా.. ఎంత అందం గా నవ్వినా.. ఆ అందం, నవ్వు వెనుక ఎన్నో బాధలు అయితే ఉంటాయి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా నటి అనన్య సోనీ జీవితాన్ని చెప్పుకోవచ్చు. పైకి ఆమె ఎంత అందంగా కనిపించినా ఆమె జీవితం లో చాలా విషాదం దాగుంది.


కొన్నేళ్లుగా ఆమె కిడ్నీ సమస్యల తో బాధపడుతుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది.ఓ విధంగా చావు, బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది అని చెప్పుకోవచ్చు. 2015 వ సంవత్సరంలో ఈమె రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఈ క్రమంలో ఆమె తండ్రి ఓ కిడ్నీ దానం చేశాడు. అప్పటి నుండి ఒక్క కిడ్నీతోనే ఈమె జీవిస్తూ వచ్చింది. కానీ ఇటీవ ల ఈమె రెండో కిడ్నీ కూడా పాడయ్యిందట. ఇటీవల ఈమె 'మేరే సాయి' సీరియల్ షూటింగ్‌లో పాల్గొంది.


 


షూటింగ్ మధ్యలోనే ఆమె కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ అనన్య సోనీ మాట్లాడుతూ.. ' నా కూతురు రెండు కిడ్నీలు పాడయ్యాయి అని డాక్టర్లు చెప్పారు. అర్జెంట్ గా వాటిని మార్చాలి కూడా తెలియజేశారు . ప్రస్తుతం ఆమె డయాలసిస్‌ మీద ఉంది. ఇప్పుడు ఆపరేషన్‌కోసం, కిడ్నీ కోసం డబ్బులు అవసరమవుతాయి. అంత డబ్బు ఖర్చుపెట్టే పరిస్థితిలో మేము లేము'' అంటూ చెప్పుకొచ్చాడట..


 


ఇక వీళ్ళది బట్టల వ్యాపారం అని అనన్య గతంలో చెప్పుకొచ్చిందట. 'మా అన్న కూడా బాగానే సంపాదించాడు.కానీ మా ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో మా బిజినెస్‌ అంతా నాశనం అయిపోయింది'' అంటూ అనన్య గతంలో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: