టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశ్వక్ సేన్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే విశ్వక్ సేన్ ఆఖరిగా ఆకశవనంలో అర్జున కళ్యాణం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ ద్వారా విశ్వక్ సేన్ ప్రేక్షకులను బాగానే అలరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విశ్వక్ సేన్ వరుస మూవీ లలో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' అనే మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు.  

మూవీ లో మిథిలా పాల్కర్ ,  విశ్వక్ సేన్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  అశ్వత్ మరిముత్తు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అక్టోబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ఓరి దేవుడా మూవీ ట్రైలర్ నీ అక్టోబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: