మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటిమానులలో ఒకరు అయిన సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకుంది. తెలుగు లో ప్రస్తుతం టాప్ హీరోయిన్  లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత ఇప్పటికే తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా అనేక మూవీ లలో నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సమంత సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ ల ద్వారా కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.

సమంత ఇప్పటికే ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో ఒక కీలకమైన పాత్రలో నటించి దేశ వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సమంత మరో వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.  ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్క బోయే మరో వెబ్ సిరీస్ కు సమంత ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ కూడా నటించ బోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ వెబ్ సిరీస్ షూటింగ్ నవంబర్ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ దర్శకుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ కావడంతో ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.  ఈ వెబ్ సిరీస్ అంతర్జాతీయ హిట్ సిరీస్ సిటాడెల్ యొక్క భారతీయ వెర్షన్ అని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండ బోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: