పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై శర్వానంద్ హీరో గా ఓ సినిమా ఇటీవలే పూజ కార్యక్రమాలు కూడా జరుపుకుంది రాశీ ఖన్నా హీరోయిన్ నటిస్తుంది. ఎన్నో అంచనాల మధ్య పూజ జరుపుకున్న ఈ సినిమా యొక్క షూటింగ్ త్వరలోనే షూటింగ్ కి వెళ్తుంది అని అందరు అనుకున్నారు కానీ ఈ సినిమా ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళకపోవడం కొంతమంది లో అనుమానాలను కలిగించింది అని చెప్పొచ్చు. కారణం ఏంటో తెలియదు కానీ ఈ సినిమా ఆగిపోయినట్లుగా వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
గీత రచయితగా కెరీర్ ను మొదలుపెట్టిన కృష్ణ చైతన్య నితిన్ చల్ మోహన్ రంగ సినిమా తో దర్శకుడిగా పరిచయమయ్యి అందరిని ఆకట్టుకున్నాడు. ఆ సినిమా కి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నిర్మాతలు గా వ్యవహరించడం విశేషం. అయితే ఆ సినిమా ఆడకపోవడం అందరిని నిరాశపరిచింది అని చెప్పాలి. ఫైనల్ గా ఈ సినిమా తర్వాత చాలా రోజులకి కృష్ణ చైతన్య మరో సినిమాను మొదలుపెట్టడం జరిగింది. అయితే ఈ సినిమా ఆగిపోయిందన్న వార్తలు రావడం నిజంగా ఆయనకు నిరాశపరిచి విషయం అనే చెప్పాలి. శర్వానంద్ ప్రస్తుతానికి మరో డైరక్టర్ తో ప్రాజెక్టు సెట్ చేసి దాన్ని పీపుల్స్ మీడియాలో చేయాలని అనుకుంటున్నారు అన్నది సమాచారం. పెద్దగా సక్సెస్ లు లేని శ్రీరామ్ ఆదిత్యతో ఒక సినిమా చేయాలని శర్వా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. బహుశా ఆ సినిమాను పీపుల్స్ మీడియాకు సెట్ చేసే అవకాశం వుందని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి