కెరటం సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్. కానీ మొదటి సినిమా ఈమెకు అంతగా గుర్తింపు అయితే తెచ్చి పెట్టలేదు.కానీ ఆ తర్వాత వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది.
ఆ తర్వాత ఎన్టీఆర్,అల్లు అర్జున్ వంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈమెకు స్టార్ స్టేటస్ వచ్చింది కూడా తెలుగు ఇండస్ట్రీ నుండే. దీనికి తెలుగు పరిశ్రమకు రకుల్ ఎప్పుడు కృతజ్ఞతాభావం చూపించాల్సిందే. తెలుగు ఇండస్ట్రీ నుండి స్టార్ అయిన రకుల్ బాలీవుడ్ కి పోయి అక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీ పై వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేస్తోంది.
దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీ రకుల్ పై చాలా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన రకుల్ ఆ తరువాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో జాకీ భగ్నానితో లవ్ ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఆమె బాలీవుడ్లో నటించిన రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ టాలీవుడ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. రకుల్ మాట్లాడుతూ.. నేను గతంలో చాలామంది సౌత్ హీరోలతో సినిమాలు చేశాను. అలాగే ఇప్పుడు బాలీవుడ్ హీరోలతో కూడా సినిమాలు చేస్తున్నాను.
కానీ ఏది ఏమైనప్పటికీ నాకు బాలీవుడ్ హీరోలు చాలా అందంగా ఉన్నట్లు అర్థమైంది. బాలీవుడ్లోని హీరోలు మంచి ఫిజిక్, బాడీని మెయింటెన్ చేస్తారు. బాలివుడ్ హీరోలు హ్యాండ్సమ్ గా కనిపించేందుకు ఎన్నో జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. కానీ ఇలాంటి క్వాలిటీస్ ఏమీ సౌత్ హీరోలలో నాకు కనిపించవు అంటూ టాలీవుడ్ హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందట రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం రకుల్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమె పై చాలా మంది తెలుగు హీరోల అభిమానులు ఫైర్ అవుతున్నారు. నీకు జీవితాన్ని ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీ నే మర్చిపోయి ఇలాంటి చెత్త మాటలు మాట్లాడతావా అంటూ ఆమెపై చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారట..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి