ఒకప్పుడు హీరోయిన్గా తన అందం అభినయంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి గుర్తింపు సంపాదించుకుంది సంఘవి. మొత్తంగా తన కెరీర్లో తెలుగుతో పాటు తమిళ కన్నడ సినిమాల్లో నటించింది. 95 సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలతో ఎన్నో మంచి విజయాలు కూడా సాధించింది. ఒకానొక సమయంలో ఇక సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది అన్న విషయం తెలిసిందే. 16 ఏళ్ల వయసులోనే తన కెరీర్ను ప్రారంభించిన సంఘవి తెలుగులో 36 సినిమాలు తమిళంలో 35 సినిమాలు కన్నడలో ఆరు సినిమాలు మలయాళం లో రెండు సినిమాలు చేసింది. ఇందులో ఎన్నో సూపర్ హిట్లు కూడా ఉన్నాయి. ఇక హిందీలో కూడా ఒక సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకుంది.
అయితే సంఘవి అసలు పేరు కావ్య. 1977 అక్టోబర్ 4న పుట్టింది. ఇక ఈమె తండ్రి మైసూరు వైద్య కళాశాలలో చెవి ముక్కు గొంతు విభాగానికి అధిపతిగా ఉండేవాడు. అయితే సంఘవి యుక్త వయసు నుంచి మోడలింగ్ పై దృష్టి పెట్టింది. ఎన్నో నాటకాలలో కూడా నటించడం ప్రారంభించింది. అయితే ప్రముఖ కన్నడ సినిమా నటి సంఘవి నాన్నమ్మకు చిన్న చెల్లెలు. ఆమెతో సంఘవి ఎన్నోసార్లు సినిమా షూటింగ్లకు వెళ్లేదట. దీంతో సినిమాల్లో హీరోయిన్గా రాణించాలని కోరిక ఆమె మనసులో పుట్టింది.
ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో అవార్డుల రివార్డు కూడా సొంతం చేసుకుంది. అయితే కెరీర్ టాప్ లో ఉన్న సమయంలోనే తెలుగు దర్శకుడు సురేష్ వర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక తర్వాత సినిమాలకు దూరమైపోయింది. ఇక కొన్నాళ్ళకి సినిమాల్లో మళ్ళీ రీ ఏంట్రీ ఇచ్చిన పెద్దగా అవకాశాలు రాలేదు. బుల్లితెరపై కూడా అడుగు పెట్టింది. అయితే మొదటి భర్తకు విడాకులు ఇచ్చి ఇక తర్వాత బెంగళూరు ఐటి ప్రొఫెషనల్ వెంకటేష్ ని రెండో వివాహం చేసుకుంది సంఘవి. ఇలా సంఘవి సినిమాలకు దూరం కావడానికి మాత్రం ఆమె ప్రేమ పేరుతో వేసిన తప్పటడుగు కారణం అన్నది తెలుస్తుంది.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి