యంగ్ హీరోలంతా ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతూ.. ఎంతోమంది స్టార్ హీరోలకు దీటుగా నిలుస్తూ ఉన్నారని చెప్పవచ్చు. రోజు రోజుకి యువ హీరోలు సైతం పరిమిత బడ్జెట్లో కొన్ని వందల కోట్ల రూపాయలు సాధించే సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అలాంటి వారిలో నిఖిల్, రిశాబ్ శెట్టి, సిద్దు జొన్నలగడ్డ తదితర నటులు సైతం ఎలాంటి కం బ్యాక్ లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటూ ఉన్నారు. కానీ అన్నీ ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రం అదృష్టం కలిసి రాలేదని చెప్పవచ్చు. అలాంటి వారిలో బాగా ఫేమస్ అయిన నటుడు రానా దగ్గుబాటి ఒకరిని చెప్పవచ్చు.

తన కెరియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ ప్రారంభమై ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటికీ కూడా సినిమాలపై వేగాన్ని పుంజుకోలేకపోతున్నారు ఈ నటుడు. అయితే ఎన్నో ప్రయోగాలు చేస్తున్నప్పటికీ కానీ అవన్నీ పెద్దగా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా కంటెంట్ పరంగా బేస్ట్ పెర్ఫార్మషన్స్ ఇస్తున్న మార్కెట్ పరంగా కాస్త వెనుక పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. రానా నటించిన బాహుబలి సినిమా పక్కన పెడితే ఇప్పటివరకు రూ.100 కోట్ల రూపాయల సక్సెస్ రేటు సాధించింది లేదని చెప్పవచ్చు.

ఈమధ్య వచ్చిన విరాటపర్వం సినిమా మరొక ప్రయత్నం చేయగా ఆ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఏ కొత్త ప్రాజెక్టును కూడా ప్రకటించలేదు. అయితే విరాటపర్వం సినిమాకి ముందు హీరో రానా ఒక పెను సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన నుంచి  రాబోయే సినిమాలు అన్నీ కూడా ఇలాంటి బలమైన కంటెంట్ ఉన్న కమర్షియల్ ఫంథా సినిమాల లోనే నటిస్తానని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఇలాంటి స్క్రిప్ట్ ఒకటి కూడా దొరకలేదా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు. రానాకి ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కూడా కథ చెప్పినట్లుగా కూడా వార్తలు వినిపించలేదు. ఇలాగే ఉంటే ఇక రానా కూడా తెలుగు ప్రేక్షకులు మర్చిపోవాల్సిందే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: