ప్రభాస్ హీరోగా నటించిన
ఆది పురుష్ చిత్రం సంక్రాంతి విడుదలవుతుందని ప్రతి ఒక్కరు కూడా భావించారు. కానీ ఈ
సినిమా మళ్లీ వర్క్ చేస్తూ ఉండడంతో ఈ
సినిమా వాయిదా పడింది.
జూన్ లో ఈ సినిమాను విడుదల చేసే విధంగా చిత్ర బృందం రంగం సిద్ధం చేస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తొందరలోనే ఇవ్వబోతుంది.అయితే అన్ని రోజులు
ప్రభాస్ నటించిన
సినిమా చూడకపోవడం అభిమానులకు నిరాశ కలిగించే విషయం అనేది చెప్పాలి.
ఈ లోపు మరొక సినిమాను ఆయన విడుదల చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. వాస్తవానికి
ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ఓ
సినిమా చే స్తున్న విషయం తెలిసిందే. ఇది అన్ని
ప్రభాస్ సినిమాలలా కాకుండా చిన్న
సినిమా అయిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని త్వరగా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురా వాలని అభిమానుల నుంచి డిమాండ్ ఏర్పడుతుంది.
మారుతి తొందరగానే సినిమాను పూర్తి చేసే విధంగా పని చేస్తాడు. ఆయన గత సినిమాలు కూడా ఎక్కువ రోజులు షూటింగ్ దశలో లేవు. ఈ నేపథ్యంలో
ప్రభాస్ గనుక డేట్ లు కేటాయిస్తే ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని
ప్రభాస్ అభిమానులు చెబుతున్నారు.
ఇతర సినిమాలకు కేటాయించిన డేట్స్ క్యాన్సిల్ చేసి ఈ సినిమాకు కేటాయిస్తే ఆయన అభిమానులు సంతోషిస్తారు అనేది కొంతమంది
సినిమా విశ్లేషకులు కూడా చెప్పే మాట. ప్రాజెక్టు కే, సలార్ వంటి చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్న
ప్రభాస్ ఒక్కసారిగా తన ప్లాన్స్ ను తారు మారు చేసుకోవడం అంటే కొంత కష్టంతో కూడుకున్న పని అని చెప్పాలి. ఏదేమైనా అభిమానుల నిరాశను తొలగించాలంటే వెంటనే ఒక సినిమాను
ప్రభాస్ విడుదల చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీని గురించి
ప్రభాస్ మరొకసారి ఆలోచిస్తే బాగుంటుంది.