బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ వరుస మూవీ లలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం షారుఖ్ ఖాన్ "పఠాన్" అనే మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  ఈ మూవీ లో దీపికా పదుకొనే , షారుక్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి జాన్ అబ్రహం కనిపించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను కూడా విడుదల చేసింది. ఈ టీజర్ లో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు  ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఎస్ రాజ్ ఫిలిం సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ కి విశాల్ -  శేఖర్ సంగీతం అందిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ఈ మూవీ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ చెప్పుకొచ్చాడు.  తాజాగా సిద్ధార్థ్ ఆనంద్ , షారుక్ ఖాన్ హీరో గా తెరకెక్కుతున్న పటాన్ మూవీ కోసం ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కాసీఓ నీల్ ను తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇతను పటాన్ మూవీ కోసం అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేసినట్లు తెలుస్తుంది. ఈ హాలీవుడ్ యక్షన్ మాస్టర్మూవీ కోసం కొరియోగ్రఫీ చేసిన యాక్షన్స్ సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: