ఒకప్పటి హీరోయిన్ ప్రస్తుత ప్రొడ్యూసర్ చార్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి . ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలో నటించి తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటుంది  ఈ ముద్దుగుమ్మ. ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తన హవా నడిపించింది అని చెప్పాలి. నీ తోడు కావాలి అనే సినిమాతో టాలీవుడ్లోకి కథానాయకగా అడుగుపెట్టిన ఛార్మి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది అని చెప్పాలి.


 ఇక దర్శక నిర్మాతలు చూపును ఆకర్షించి స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. అయితే ఇక ఎన్నో హిట్ సినిమాలను కూడా ఈ అమ్మడు ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. కొన్నిసార్లు ఈమె చేసిన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అవకాశాలు మాత్రం వరుసగా తలుపుతడుతూనే ఉండేవి. అయితే ఇలా స్టార్ హీరోయిన్గా కొనసాగింది సార్ మీకు ఒక్కసారిగా ఇండస్ట్రీలో కనుమరుగయింది. ఆ తర్వాత  లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన పెద్దగా ఆడలేదు.


 స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే ఐటెం సాంగ్స్ తో కూడా కుర్రకారును ఒక ఊపు ఊపేసింది ఈ ముద్దుగుమ్మ. ఇలా అప్పట్లో స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఛార్మి ఇప్పుడు మాత్రం ప్రొడ్యూసర్ గా కొనసాగుతుంది. అయితే చార్మికి ఇక నటన మీద ఉన్న ఆసక్తిని పోగొట్టింది మాత్రం కొంతమంది దర్శకులు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మను ఐటమ్ గర్ల్ గా మార్చి నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోగొట్టారట. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా నటించిన పెద్దగా ప్రేక్షకులు ఆదరించకపోవడంతో చివరికి చార్మి మొత్తం నటనకు దూరమైందని అభిమానులు అంటున్నారు. ఇలా ఛార్మి కెరియర్ నాశనం కావడానికి ఆమెను ఐటమ్ గర్ల్ గా మార్చిన దర్శకులే కారణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: